- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బెటాలియన్ కానిస్టేబుల్స్ పనిభారాన్ని పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కానిస్టేబుల్స్‌తోపాటు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్న న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరారు. రెండు రోజులుగా బెటాలియన్ కానిస్టేబుల్స్, వారి కుటుంబసభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని, రికార్డు పర్మిషన్‌కు సంబంధించిన జీవోను తక్షణమే వాపస్ తీసుకోవాలని కోరారు. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధంగానే ఒకే పోలీస్ విధానం ఉండాలని కోరుతున్నారని, ఈ జీవో వల్ల పనిభారం పెరుగుతోందన్నా